చిత్తూరు గడ్డ గర్వించే నాయకుడు గురజాల జగన్ మోహన్.. ఏడో ర్యాంకు పై చిత్తూరు 10వ వార్డు టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమార్ హర్షం!...
చిత్తూరు (రాజనీతి): మూడ్ ఆఫ్ ఏపీ–చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు సాధించినట్లు వెల్లడైంది. ఇటీవల జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించగా, తాజాగా రాష్ట్రస్థాయిలో ఏడో స్థానంలో నిలిచినట్లు ఆయన అనుచరులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా చిత్తూరు నగరం పదో వార్డు టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆశీస్సులతో ఆయన ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.భవిష్యత్తులో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి, చిత్తూరు నియోజకవర్గంతోపాటు రాష్ట్ర అభివృద్ధికి తన సేవలను విస్తరించాలని కుమార్ ఆకాంక్షించారు.