🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 09 Oct, 2026 | Page: 1

రూ.1.20 కోట్ల కాపర్‌ వైర్‌ చోరీ కేసు చేదించిన రేణిగుంట పోలీసులు

రేణిగుంట అక్టోబర్ 9 (రాజనీతి): రూ.1.20 కోట్ల విలువైన ఏడు టన్నుల కాపర్‌ వైర్‌ చోరీ కేసును రేణిగుంట పోలీసులు ఛేదించారు. శుక్రవారం అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన ఆర్‌.రాజా, కె.నవీన్‌కుమార్‌లను అరెస్టు చేసి, కాపర్‌ వైర్‌తో పాటు లారీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బెంగళూరు నుంచి శ్రీసిటీకి తరలించాల్సిన సరుకును దారి మళ్లించి వేలూరు సమీపంలో పాతిపెట్టినట్లు వివరించారు. ప్రధాన నిందితుడు వినోద్‌కుమార్‌, మరో నిందితుడు దినేష్‌ పరారీలో ఉన్నారని తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందికి ఎస్పీ రివార్డులు ప్రకటించినట్లు వెల్లడించారు.
🏠 Home