జర్నలిస్టుల గళానికి కొత్త బలం..జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా జ్ఞాన ప్రకాష్!
చిత్తూరు(రాజనీతి): జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షుల సూచనల మేరకు రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీపతి ఆధ్వర్యంలో బుధవారం చిత్తూరు జిల్లా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా జ్ఞాన ప్రకాష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జ్ఞాన ప్రకాష్కు యూనియన్ నాయకులు, జర్నలిస్టులు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా ఉపాధ్యక్షులు జ్ఞాన ప్రకాష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీపతి సార్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. యూనియన్ నాయకులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని, జిల్లాలోని జర్నలిస్టుల సమస్యలను యూనియన్ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. జర్నలిస్టులందరినీ ఐక్యంగా ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.జాప్ ను మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని, రాష్ట్ర నాయకత్వం సూచనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తానని జ్ఞాన ప్రకాష్ తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను పదవిగా కాకుండా జర్నలిస్టులకు సేవ చేసే అవకాశంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.