కెమిస్ట్రీలో నోబెల్.. హెన్రీ బి. కాగన్, కెన్సో సోయ్కు సంయుక్తంగా!
రాజనీతి | అంతర్జాతీయం | అక్టోబర్ 7, 2026
2026 రసాయన శాస్త్ర నోబెల్ పురస్కారం ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ బి. కాగన్, జపాన్‌కు చెందిన కెన్సో సోయ్‌లకు సంయుక్తంగా లభించింది. అసమమిత సేంద్రీయ సంశ్లేషణలో నాన్-లీనియర్ ప్రభావాలు, ఆటోక్యాటలిసిస్పై చేసిన కీలక పరిశోధనలకు ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించారు. జీవ ప్రపంచంలో కొన్ని అణువులు తమ ‘మిర్రర్ ఇమేజ్’ రూపాల్లో ఒకదానినే ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తాయన్న శతాబ్దాల నాటి రసాయన రహస్యాన్ని అర్థం చేసుకోవడంలో వీరి పరిశోధన కీలకంగా మారింది.
అనేక సేంద్రీయ అణువులు ఒకదానికొకటి అద్దంలో కనిపించే ప్రతిబింబాల్లాంటి రెండు రూపాల్లో ఉంటాయి. వీటిని చిరల్ అణువులు అంటారు. మన చేతులు ఎడమ, కుడి చేతులుగా ఒకదానికొకటి ప్రతిబింబాలుగా ఉన్నట్లే.. ఈ అణువుల రెండు రూపాలు కూడా ఒకేలా కనిపించినా వాటి లక్షణాల్లో తేడాలు ఉండొచ్చు. జీవుల్లో మాత్రం కొన్ని ముఖ్యమైన అణువులు ఈ రెండు రూపాల్లో ఒకదానినే ప్రధానంగా ఉపయోగిస్తాయి. దీనినే హోమోచిరాలిటీగా పిలుస్తారు.
‘మిర్రర్ ఇమేజ్’ అణువుల శతాబ్దపు రహస్యానికి పరిష్కారం.. ఔషధాల తయారీలో కీలకమైన పరిశోధనకు ప్రపంచ గుర్తింపు
ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా హెన్రీ కాగన్ 1980లలో చేసిన పరిశోధనలు కీలక మలుపుగా నిలిచాయి. రసాయన చర్యల్లో ఏర్పడే స్వల్ప అసమానతను ఒక నిర్దిష్ట దిశలో పెంచే విధానాలను ఆయన అభివృద్ధి చేశారు. అనంతరం కెన్సో సోయ్ ఆటోక్యాటలిటిక్ చర్యలపై చేసిన పరిశోధనలతో ఒక అణువు తనలాంటి మరిన్ని అణువులు ఏర్పడేందుకు ప్రేరకంగా పనిచేయగలదని చూపించారు.
ఈ పరిశోధనలకు కేవలం సైద్ధాంతిక ప్రాధాన్యం మాత్రమే లేదు. ఔషధాల తయారీలో ఒక అణువు ఏ రూపంలో ఉండాలి అనేది అత్యంత కీలకం. ఒకే రసాయన పదార్థానికి చెందిన రెండు మిర్రర్ ఇమేజ్ రూపాల్లో ఒకటి చికిత్సకు ఉపయోగపడుతుండగా.. మరొకటి భిన్నమైన లేదా హానికర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. అందువల్ల కావాల్సిన రూపంలోని అణువును కచ్చితంగా తయారు చేసే పద్ధతులు ఔషధ పరిశ్రమకు ఎంతో ముఖ్యమైనవి.
ఈ పరిశోధన ప్రాధాన్యాన్ని గతంలో చోటుచేసుకున్న థాలిడోమైడ్ ఘటన కూడా గుర్తుచేస్తుంది. ఆ ఔషధంలోని ఒక మిర్రర్ ఇమేజ్ రూపం తీవ్రమైన దుష్ప్రభావాలకు కారణమైన విషయం తరువాతి పరిశోధనల్లో వెల్లడైంది. దీంతో ఔషధాల్లో అణువుల నిర్మాణాన్ని నియంత్రించడం ఎంత కీలకమో స్పష్టమైంది.
95 ఏళ్ల హెన్రీ బి. కాగన్ ఫ్రాన్స్‌లోని యూనివర్సిటీ పారిస్-సుడ్తో అనుబంధం కలిగి ఉండగా.. 76 ఏళ్ల కెన్సో సోయ్ జపాన్‌లోని టోక్యో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్‌కు చెందినవారు. ఇద్దరూ కలిసి 12 మిలియన్ స్వీడిష్ క్రోనర్ల నగదు బహుమతిని అందుకోనున్నారు. డిసెంబర్ 10న స్టాక్‌హోమ్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో నోబెల్ పతకం, డిప్లొమాతో పాటు పురస్కారాన్ని అందజేయనున్నారు.
అణువుల ‘ఎడమ–కుడి’ రహస్యాన్ని ఛేదించిన పరిశోధనకు దక్కిన ఈ నోబెల్.. భవిష్యత్ ఔషధాల రూపకల్పనలో మరింత ఖచ్చితత్వానికి మార్గం చూపనుంది.