🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 05 Oct, 2026 | Page: 1

28 వేల అడుగుల మేర ఒక్కసారిగా కిందికి.. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో ఎమర్జెన్సీ!

రాజనీతి | అంతర్జాతీయం | అక్టోబర్‌ 5, 2026

లండన్‌ నుంచి అమెరికాలోని చికాగోకు బయలుదేరిన బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ BA295 విమానంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఐర్లాండ్‌ గగనతలంలో ప్రయాణిస్తున్న సమయంలో విమానం ఒక్కసారిగా భారీగా దిగువకు వచ్చింది. ఫ్లైట్‌-ట్రాకింగ్‌ డేటా ప్రకారం సుమారు 37 వేల అడుగుల నుంచి 9 వేల అడుగుల ఎత్తుకు, అంటే దాదాపు 28 వేల అడుగుల మేర విమానం దిగింది. అనంతరం పైలట్లు అంతర్జాతీయ ఎమర్జెన్సీ ట్రాన్స్‌పాండర్‌ కోడ్‌ 7700ను సెట్‌ చేసి విమానాన్ని లండన్‌ వైపు మళ్లించారు.

7 వేల అడుగుల ఎత్తు నుంచి 9 వేల అడుగులకు వేగంగా దిగిన విమానం.. 7700 ఎమర్జెన్సీ కోడ్‌తో లండన్‌కు తిరుగు ప్రయాణం..

చికాగో ప్రయాణం రద్దు

హీత్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరిన బోయింగ్‌ 777-200ER విమానం చికాగో ఓ'హేర్‌ విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉంది. ఐర్లాండ్‌ మీదుగా అట్లాంటిక్‌ వైపు వెళ్తుండగా అత్యవసర పరిస్థితి తలెత్తడంతో ప్రయాణాన్ని కొనసాగించకుండా తిరిగి లండన్‌కు మళ్లినట్లు సమాచారం.

7700 కోడ్‌ ఎందుకు కీలకం?

విమానాల్లో 7700 అనేది సాధారణ అత్యవసర పరిస్థితిని సూచించే అంతర్జాతీయ ట్రాన్స్‌పాండర్‌ కోడ్‌. పైలట్లు దీనిని సెట్‌ చేసినప్పుడు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు విమానంలో అత్యవసర పరిస్థితి ఉందని తెలుస్తుంది. అయితే ఈ కోడ్‌ ద్వారా అత్యవసర పరిస్థితికి అసలు కారణం ఏమిటో మాత్రం తెలియదు.

అసలు కారణం ఏమిటి?

విమానం ఎందుకు అంత వేగంగా దిగిందనే దానిపై ఇప్పటివరకు అధికారికంగా స్పష్టత రాలేదు. సాంకేతిక సమస్య, క్యాబిన్‌ ప్రెజర్‌కు సంబంధించిన ఇబ్బంది, వైద్య అత్యవసర పరిస్థితి లేదా ఇతర ఆపరేషనల్‌ కారణాలు ఉండొచ్చనే అవకాశాలు ఉన్నప్పటికీ.. ఏ కారణాన్నీ అధికారులు ఇంకా నిర్ధారించలేదు.

ప్రాథమిక నివేదికల ప్రకారం విమానం సురక్షితంగా లండన్‌కు తిరిగి చేరింది. ప్రయాణికులు, సిబ్బంది పరిస్థితిపై ఎలాంటి ప్రాణనష్టం సమాచారం లేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ అధికారిక ప్రకటన తర్వాత మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.

ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ఒక్కసారిగా భారీగా దిగిన విమానం.. ఎమర్జెన్సీ కోడ్‌.. వెంటనే లండన్‌కు తిరుగు ప్రయాణం.. BA295 ఘటనపై అసలు కారణం తేలాల్సి ఉంది.
🏠 Home