ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 67 ఫిర్యాదులు
మదనపల్లె అక్టోబరు 5 (రాజనీతి): మదనపల్లె ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 67 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.వెంకటాద్రి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో భూ వివాదాలు 35, ఆర్థిక 8, కుటుంబ 9, న్యూసెన్స్ 5, పరిపాలన 2, సైబర్ 2, ఇతర 6 ఉన్నాయి. ఫిర్యాదులపై చట్టపరంగా సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.