రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు సోమల విద్యార్థులు
సోమల, అక్టోబరు 5 (రాజనీతి): సోమల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థులు సులేమాన్, పురుషోత్తం రాష్ట్రస్థాయి అండర్-14 హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. పద్మావతిపురం పాఠశాల ఆవరణలో జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎంపికల్లో ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు హేమసుధాకర్ తెలిపారు. ఈ నెల 9 నుంచి 11 వరకు తెనాలిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వారు పాల్గొంటారని పీడీ కరుణానిధి తెలిపారు. విద్యార్థులను ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.