🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 05 Oct, 2026 | Page: 1

జిల్లా టీకాల కేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన

మదనపల్లె, అక్టోబరు 5 (రాజనీతి): ప్రజలకు మెరుగైన టీకా సేవలు అందించేందుకు జిల్లా టీకాల కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ శర్మ సోమవారం పరిశీలించారు. ఇరిగేషన్‌ ఈఈ కార్యాలయ ప్రాంగణంలోని సుమారు 3,000 చదరపు అడుగుల స్థలాన్ని డీఎంహెచ్‌ఓ, తహసీల్దార్‌తో కలిసి పరిశీలించారు. కేంద్రం ఏర్పాటుకు మౌలిక వసతులు, భవన నిర్మాణ అనుకూలత, ప్రజల రాకపోకల సౌలభ్యాన్ని పరిశీలించి, తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చిన్నారులు, అవసరమైన వర్గాలకు టీకా సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
🏠 Home