🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 05 Oct, 2026 | Page: 1

ఆల్బెండజోల్‌ మాత్రలతో నులిపురుగులకు చెక్‌

వాయల్పాడు, అక్టోబరు 5 (రాజనీతి): చింతపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం మాప్‌అప్‌ డేను డాక్టర్‌ జులేఖ బేగం ఆధ్వర్యంలో నిర్వహించారు. గత నెల 25న ఆల్బెండజోల్‌ మాత్రలు తీసుకోని విద్యార్థులకు సోమవారం మాత్రలు అందించారు. నులిపురుగులతో రక్తహీనత, కడుపునొప్పి, బలహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగింపు వంటి సమస్యలు తలెత్తవచ్చని డిప్యూటీ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ మహమ్మద్‌ రఫీ తెలిపారు. పరిశుభ్రత పాటించాలని సూచించారు.
🏠 Home