🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 04 Oct, 2026 | Page: 1

రామక్క మృతికి చింతల రామచంద్రారెడ్డి సంతాపం

పీలేరు అక్టోబర్ 4 (రాజనీతి): పీలేరు మండలం జాండ్ల గ్రామం సూర్య నాయక్‌ తండాకు చెందిన సాక్షి టీవీ రిపోర్టర్‌ బుక్కే రవి నాయక్‌ తల్లి రామక్క (65) మృతి చెందారు. విషయం తెలుసుకున్న పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆదివారం ఆమె స్వగృహానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
🏠 Home