రాత్రివేళల్లో పోలీసుల ప్రత్యేక నిఘా
పుంగనూరు, అక్టోబరు 4 (రాజనీతి): శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రాత్రివేళల్లో పోలీసులు ప్రత్యేక నిఘా, గస్తీని ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు ఏటీఎంలు, దేవాలయాలు, బస్టాండ్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులను తనిఖీ చేస్తూ వేలిముద్రలు సేకరిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.