🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 04 Oct, 2026 | Page: 1

వేగంగా స్పందించిన పోలీసులు.. బాలుర ఆచూకీ లభ్యం

రేణిగుంట అక్టోబర్ 4 (రాజనీతి): అదృశ్యమైన ఇద్దరు బాలుర ఆచూకీని రేణిగుంట పోలీసులు కొద్ది గంటల్లోనే గుర్తించి, వారిని సురక్షితంగా కుటుంబ సభ్యుల చెంతకు చేర్చేందుకు చర్యలు చేపట్టారు. రాత్రి 11 గంటల సమయంలో మహబూబ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌లో బాలురు ఉన్నట్లు సమాచారం అందగానే పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాత్రికిరాత్రే అక్కడికి బయలుదేరారు. డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో సిబ్బంది సమన్వయంతో స్పందించారు. ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తూ బాలల క్షేమానికి ప్రాధాన్యం ఇచ్చిన పోలీసుల చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
🏠 Home