రైలు ప్రయాణికులకు కొత్త రూల్స్.. ఇక నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు!
రాజనీతి | నేషనల్ | అక్టోబర్ 3, 2026
జన్ విశ్వాస్ చట్టంతో రైల్వే నిబంధనల్లో మార్పులు.. టికెట్ లేకుండా ప్రయాణం నుంచి పొగతాగడం, అక్రమ విక్రయాల వరకు కఠిన చర్యలు
రైలు ప్రయాణికులు ఇక మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. రైళ్లలో ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణను దృష్టిలో పెట్టుకుని జన్ విశ్వాస్ (అమెండ్మెంట్ ఆఫ్ ప్రొవిజన్స్) యాక్ట్–2026 కింద రైల్వే నిబంధనల్లో పలు మార్పులు చేశారు. టికెట్ లేకుండా ప్రయాణించడం, పొగతాగడం, అనధికారికంగా వస్తువులు విక్రయించడం, మహిళల కోసం కేటాయించిన సీట్లలో ప్రయాణించడం వంటి ఉల్లంఘనలకు జరిమానాలు పెంచారు.
టికెట్ లేకుండా ప్రయాణిస్తే రూ.500
చెల్లుబాటు అయ్యే టికెట్ లేదా పాస్ లేకుండా ప్రయాణిస్తే గతంలో ఉన్న కనీస అదనపు ఛార్జీని రూ.250 నుంచి రూ.500కు పెంచారు. ఇతరుల పేరుతో ఉన్న టికెట్‌ను ఉపయోగించినా ఇదే నిబంధనలు వర్తిస్తాయి.
పొగతాగితే రూ.2,000 జరిమానా
రైలు లేదా నిషేధిత రైల్వే ప్రాంగణంలో పొగతాగితే రూ.2,000 జరిమానా విధించవచ్చు. అదనంగా పాస్ లేదా టికెట్‌ను రద్దు చేసి, అవసరమైతే ప్రయాణికుడిని రైలు నుంచి దించివేయడానికి రైల్వే సిబ్బందికి అధికారం ఉంటుంది. జరిమానా చెల్లించకపోతే కేసును కోర్టుకు తీసుకెళ్లవచ్చు.
అనధికారిక విక్రయాలు, భిక్షాటనకు చెక్
రైలులో లేదా రైల్వే ప్రాంగణంలో చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా హాకింగ్, విక్రయాలు చేస్తే రూ.2,000 జరిమానా విధించనున్నారు. రైలులో, రైల్వే పరిధిలో భిక్షాటనపైనా చర్యలు ఉంటాయి. జరిమానా చెల్లించకపోతే కోర్టు ద్వారా జైలు శిక్ష లేదా అదనపు జరిమానా విధించే అవకాశం ఉంది. పునరావృత ఉల్లంఘనలకు మరింత కఠినమైన శిక్షలు ఉన్నాయి.
నిషేధిత వస్తువులు తీసుకెళ్తే రూ.10,000
రైళ్లలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్ సిలిండర్లు, బాణసంచా, యాసిడ్లు, ఇతర మండే లేదా ప్రమాదకర వస్తువులు తీసుకెళ్లడంపై కఠిన చర్యలు ఉంటాయి. ఇలాంటి నిషేధిత వస్తువులను రవాణా కోసం తీసుకెళ్లినట్లు తేలితే కనీసం రూ.10,000 జరిమానా విధించే నిబంధన అమల్లోకి వచ్చింది.
మహిళల కోచ్‌లో అనధికారికంగా ప్రయాణిస్తే..
మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన కోచ్, బెర్త్ లేదా సీటులో అనుమతి లేకుండా పురుషులు ప్రయాణిస్తే రూ.2,500 జరిమానా విధించడంతో పాటు వారిని అక్కడి నుంచి తొలగించే అవకాశం ఉంది.
అక్టోబర్ 1 నుంచి టికెట్ తనిఖీలు కూడా ముమ్మరం
మరోవైపు అక్టోబర్ 1 నుంచి రైల్వే ప్రత్యేక టికెట్ చెకింగ్ డ్రైవ్ చేపట్టింది. ప్రయాణికులు తమ టికెట్‌తో పాటు ఒరిజినల్ గుర్తింపు పత్రాన్ని వెంట ఉంచుకోవాలని సూచించింది. టికెట్, ప్రయాణికుడి వివరాలు సరిపోలకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
రైలు ప్రయాణం ఇక టికెట్ తీసుకోవడంతోనే పూర్తికాదు.. నిబంధనలు పాటించడం కూడా అంతే ముఖ్యం. చిన్న ఉల్లంఘనకే జరిమానా పడే అవకాశం ఉండటంతో ప్రయాణికులు ముందుగానే అప్రమత్తంగా ఉండాలి.