🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 02 Oct, 2026 | Page: 1

కుష్ఠువ్యాధిపై వివక్షను వీడాలి...డిప్యూటీ హెచ్‌ఈఓ మహమ్మద్‌ రఫీ

వాయల్పాడు అక్టోబర్ 2 (రాజనీతి): కుష్ఠువ్యాధిపై సమాజంలో ఉన్న అపోహలు, వివక్షను తొలగించి బాధితులకు గౌరవం కల్పించాలని డిప్యూటీ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ మహమ్మద్‌ రఫీ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా చింతపర్తి పీహెచ్‌సీ, బస్టాండ్‌లోని గాంధీ విగ్రహం వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కుష్ఠువ్యాధి సూక్ష్మక్రిమి వల్ల వస్తుందని, దేవుడి శాపం లేదా గత జన్మ పాపం వల్ల కాదని తెలిపారు. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి చికిత్స పొందితే పూర్తిగా నయం చేయవచ్చన్నారు. అనంతరం అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
🏠 Home