ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
చౌడేపల్లి అక్టోబర్ 2 (రాజనీతి): చౌడేపల్లి మండలంలో శుక్రవారం ఓ వ్యక్తి ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చారాలకురపల్లికి చెందిన అలీఖాన్ (42) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి దాచేపల్లికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని చింతచెట్టుకు ఉరేసుకుని ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.