ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
కలికిరి అక్టోబర్ 1 (రాజనీతి): పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం పత్తెగడ గ్రామం పాలెం కురవపల్లి, కొండకావలిపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్కుమార్రెడ్డి మండల కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను అందజేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.