పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
రేణిగుంట సెప్టెంబర్ 30 (రాజనీతి): మద్యానికి బానిసై జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రేణిగుంట పోలీసులు తెలిపారు. వెదళ్లచెరువు ఎస్టీ కాలనీకి చెందిన కొడవల కిరణ్ (30) వ్యవసాయ కూలీగా, అప్పుడప్పుడు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మద్యం మానుకోవాలని భార్య మందలించడంతో మనస్తాపానికి గురై ఈ నెల 28న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు రుయా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 29న మృతి చెందాడు. భార్య మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ జయచంద్ర తెలిపారు.