రైతు సంక్షేమమే లక్ష్యం: పీఏసీఎస్ చైర్మన్ వీరాపురం భాస్కర్రెడ్డి
రేణిగుంట, సెప్టెంబర్ 30 (రాజనీతి): రైతుల సంక్షేమం కోసం పీఏసీఎస్ ద్వారా పంట రుణాలు, వ్యవసాయ రుణాలు, విత్తనాలు, ఎరువులు తదితర సహకార సేవలు అందుబాటులో ఉన్నాయని పీఏసీఎస్ చైర్మన్ వీరాపురం భాస్కర్రెడ్డి తెలిపారు. రైతులు తమ అవసరాలకు అనుగుణంగా పీఏసీఎస్ కార్యాలయాన్ని సంప్రదించి అందుబాటులో ఉన్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా, రైతుల అభివృద్ధికి సహకార సేవలను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.