గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి
కలికిరి సెప్టెంబర్ 29 (రాజనీతి): కలికిరి మండలం టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ ఉత్సవం–సేవా సంకల్ప అభియాన్ నిర్వహించారు. అంగన్వాడీ సేవలు, ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవై)పై గర్భిణులకు అవగాహన కల్పించారు. గర్భధారణ నుంచే పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని, ఆరోగ్యవంతమైన శిశువు జన్మిస్తాడని వివరించారు.