జనావాసాల మధ్య వైన్‌షాపులు తొలగించాలి... గ్రీవెన్స్‌లో డీఆర్ఓకు ఐద్వా నేతల వినతి
రేణిగుంట సెప్టెంబర్ 29 (రాజనీతి): రేణిగుంట పట్టణంలోని జనావాసాలు, పాఠశాలలు, మహిళా కళాశాల, గంగమ్మ ఆలయం, బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఆద్య (షాప్ నం.53), సర్వేశ్ (షాప్ నం.52) వైన్ షాపులను తక్షణమే తొలగించాలని ఐద్వా నేతలు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. జనావాసాల మధ్య మద్యం దుకాణాలతో మహిళలు, విద్యార్థులు, భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, తొమ్మిది రోజులుగా నిరసనలు చేస్తున్నామని తెలిపారు. రెండు షాపులపై విచారణ జరిపి ఊరి బయటకు తరలించాలని కొండ్రెడ్డి ఈశ్వరమ్మ, భారతి, పద్మావతి కోరారు.