🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 29 Sep, 2026 | Page: 1

చంద్రబాబు బాటలో.. లోకేష్ మార్గంలో..గురజాల జగన్‌ మోహన్ వెంటే!...చిత్తూరు 10వ వార్డు టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమార్

చిత్తూరు(రాజనీతి): పార్టీ పదవి కోసం కాకుండా తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం నిరంతరం పనిచేస్తానని చిత్తూరు 10వ వార్డు టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమార్ స్పష్టం చేశారు. 2015 నుంచి ఇప్పటి వరకు టీడీపీ కోసం పనిచేస్తున్నానని, భవిష్యత్తులోనూ పార్టీ అభివృద్ధి కోసం తన వంతు కృషి కొనసాగిస్తానని తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై విశ్వాసంతో, మంత్రి నారా లోకేష్ చూపిస్తున్న మార్గంలో ముందుకు సాగుతానని కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడమే తన లక్ష్యమని చెప్పారు.టీడీపీలో పదవి రావడం, రాకపోవడం తనకు ముఖ్యమైన విషయం కాదని.. పార్టీ కోసం పనిచేయడమే తనకు ప్రధానమని కుమార్ అన్నారు. 2015 నుంచి పసుపు జెండాను నమ్ముకుని పనిచేస్తున్నానని, భవిష్యత్తులోనూ అదే జెండాతో ప్రయాణం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.“పార్టీ పదవి కోసం కాదు.. టీడీపీ కోసం పనిచేస్తా. ఊపిరి ఉన్నంత వరకు పసుపు జెండాను మోస్తా. పార్టీ బలోపేతం, ప్రజల సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తా” అని కుమార్ తెలిపారు.చిత్తూరు 10వ వార్డులో పార్టీ కార్యక్రమాలను మరింత చురుగ్గా నిర్వహిస్తూ కార్యకర్తలు, ప్రజలతో సమన్వయంతో ముందుకు సాగుతానని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయకత్వంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి, రాబోయే ఎన్నికల్లో పార్టీ కార్యక్రమాలకు అండగా నిలుస్తానని కుమార్ తెలిపారు.
🏠 Home