🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 26 Sep, 2026 | Page: 1

విద్యార్థుల భద్రతకు తపస్యా స్కూల్‌ చర్యలు... యాజమాన్యాన్ని అభినందిస్తున్న స్థానికులు

రేణిగుంట (రాజనీతి):రేణిగుంట పట్టణంలోని తపస్యా స్కూల్‌ యాజమాన్యం విద్యార్థుల భద్రతకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాఠశాల సమయంలో స్కూల్ వ్యాన్ల నుంచి దిగిన పిల్లలు రోడ్డుపైకి వెళ్లకుండా చిన్న బారికేడ్లు ఏర్పాటు చేసి, విద్యార్థులను సురక్షితంగా పాఠశాలలోకి పంపిస్తున్నారు. పిల్లలందరూ లోపలికి వెళ్లిన తర్వాత వాటిని తొలగిస్తున్నారు. విద్యార్థుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టిన తపస్యా పాఠశాల యాజమాన్యాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.
🏠 Home