🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 24 Sep, 2026 | Page: 1

మదనపల్లిలో ఆర్టీసీ డీపీటీవో కార్యాలయం ఏర్పాటు చేయాలి

మదనపల్లి సెప్టెంబర్ 24 (రాజనీతి): అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో ఆర్టీసీ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసు (డీపీటీవో/డీటీసీ) కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ మాట్లాడుతూ జిల్లా కేంద్రంగా ఏర్పడి తొమ్మిది నెలలు గడుస్తున్నా కార్యాలయం ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు, డ్రైవర్లు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రవాణా సంబంధిత పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో సమయం, డబ్బు వృథా అవుతున్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఉన్నతాధికారులతో సంప్రదించి కార్యాలయం ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సి.ఏ. బాబు, ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు గజపతి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home