🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 24 Sep, 2026 | Page: 1

కేడర్‌ కదలాలి.. పార్టీ గెలవాలి!గురజాల జగన్‌ మోహన్‌ పిలుపు...

చిత్తూరు( రాజనీతి ):చిత్తూరు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్‌ సూచించారు. గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలోని ప్రజాదర్బార్‌లో క్లస్టర్ల వారీగా డివిజన్‌ నాయకులతో సమీక్ష నిర్వహించారు. క్లస్టర్‌ ఇన్‌చార్జులు, డివిజన్‌ ఇన్‌చార్జులు, డివిజన్‌ పార్టీ కమిటీ సభ్యులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి డివిజన్‌లో పార్టీ కార్యక్రమాలను బలోపేతం చేయాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. డివిజన్ల వారీగా పార్టీ పరిస్థితి, కార్యకర్తల భాగస్వామ్యం, ప్రజలతో సంబంధాలు, స్థానిక సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. క్లస్టర్‌, డివిజన్‌ స్థాయిలో అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని, ఎన్నికల వరకు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వం ఇచ్చే సూచనలను పాటిస్తూ కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్లాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమష్టిగా సిద్ధం కావాలని ఎమ్మెల్యే జగన్‌మోహన్‌ పిలుపునిచ్చారు.
🏠 Home