బాలల ఆరోగ్యం దేశానికి సౌభాగ్యం... ఎంపీడీవో శివశంకరయ్య
పీలేరు, సెప్టెంబరు 23 (రాజనీతి): విద్యార్థుల్లో నులిపురుగుల సంక్రమణను నివారించేందుకు డీ-వార్మింగ్ మాత్రలతో పాటు ఆరోగ్య సూత్రాలను అలవర్చేలా అవగాహన కల్పించాలని ఎంపీడీవో శివశంకరయ్య సూచించారు. సెప్టెంబరు 25న నిర్వహించనున్న డీ-వార్మింగ్ కార్యక్రమంపై బుధవారం ఆరోగ్య, ఐసీడీఎస్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. నులిపురుగుల వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, నీరసం, కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. కార్యక్రమాన్ని సూక్ష్మ ప్రణాళికతో విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో వైద్యులు డా. శ్రీగిరీష, డా. రాధామాధవి, డిప్యూటీ హెచ్ఈఓలు కొండయ్య, కృష్ణమ్మ, పీహెచ్ఎన్ కుసుమ, ఐసీడీఎస్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.