🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 23 Sep, 2026 | Page: 1

పుంగనూరు పరిశీలకుడిని కలిసిన వైసీపీ దళిత ప్రతినిధులు

పుంగనూరు, సెప్టెంబరు 23 (రాజనీతి): వైసీపీ పుంగనూరు నియోజకవర్గ పరిశీలకుడు జింక చలపతిని బుధవారం దళిత సామాజికవర్గానికి చెందిన పార్టీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చలపతి మాట్లాడుతూ రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో దళిత సామాజికవర్గం ఐక్యంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి చిన్న ఎల్లప్ప, కార్యదర్శి వడ్డీ హరి, సహాయ కార్యదర్శి వెంకటస్వామి, నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు బ్యాంకు రెడ్డప్ప, నాయకులు పరికదిన్ని బాబు, రామసముద్రం భాస్కర్‌, అమ్రేష్‌, శేషు, సీతాపతి, బోయకొండ వాసు, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home