🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 22 Sep, 2026 | Page: 1

“మాటలు కాదు.. ఆధారాలు చూపించు! ప్రమాణానికి నువ్వే రా!”...రూ.30 కోట్ల ఆరోపణలు రుజువు చేయగలవా..? కుమారస్వామి సవాల్

చిత్తూరు( రాజనీతి ): బీసీలను చిన్నచూపు చూడటం, నిజాయితీగా పనిచేసే వారిపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్‌ పీఏ కుమారస్వామి అన్నారు. తనపై రూ.30 కోట్ల అక్రమ సంపాదన చేశానంటూ చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాల్‌ చేశారు. మంగళవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.తమ ఊరిలో క్వారీ ఉన్నంత మాత్రాన దానితో తనకు సంబంధం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. క్వారీతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చిత్తూరు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న తమపై రాజకీయ ఆరోపణలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, తనపై ఎలాంటి కేసులు లేవని చెప్పారు.తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని కుమారస్వామి ప్రకటించారు.అదే సమయంలో ప్రత్యర్థిపై ఉన్నాయని తాను పేర్కొంటున్న ఎర్రచందనం, అక్రమ వ్యాపారాలు, లిక్కర్‌ వ్యవహారాలు, ఈడీ విచారణ తదితర ఆరోపణలపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు. అయితే వీటన్నింటినీ ప్రత్యర్థి నిరూపించాల్సిన అంశాలుగా పేర్కొన్నారు.గతంలో చేసిన, ప్రస్తుతం చేస్తున్న ఆరోపణలపై ఇద్దరం తిరుమల లేదా కాణిపాకంలో ప్రమాణం చేద్దామని సవాల్‌ చేశారు. అనుచరులను పంపకుండా స్వయంగా రావాలని కోరారు. ప్రమాణానికి తేదీ, సమయాన్ని ప్రత్యర్థే నిర్ణయించాలని అన్నారు.గడిచిన కాలంలో చిత్తూరులో జరిగిన అభివృద్ధిని చూడకుండా అభివృద్ధి కోసం పనిచేస్తున్న వారిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలకు అందుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలితాలను చూసి ఓర్వలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, తప్పుడు ఆరోపణలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు.
🏠 Home