🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 22 Sep, 2026 | Page: 1

చిత్తూరుకు అభివృధి జాతర!... ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్....

చిత్తూరు( రాజనీతి ):చిత్తూరు నగర సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 123 నగర, పురపాలక సంఘాల్లో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కుప్పం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్‌, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌ రూ.60 కోట్ల హెచ్ఏఎం నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పట్టణాలు, నగరాలను అభివృద్ధి బాటలో నడిపించేందుకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తోందన్నారు. చిత్తూరు నగర అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేనివిధంగా గడిచిన రెండున్నరేళ్లలో నిధులు విడుదలయ్యాయని తెలిపారు. హెచ్ఏఎం నిధులతో రహదారులు, వీధిలైట్లు, కాలువలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి రూ.60 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. చిత్తూరు నగరానికి ఇప్పటివరకు మొత్తం రూ.404.42 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో రూ.164.42 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయని, మరో రూ.240 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు లభించాయని వివరించారు. నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ప్రజలకు మేలు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. చిత్తూరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైకాపా నాయకులు రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్‌ ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. గత వైకాపా పాలనలో నగరాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని, కనీసం రహదారులపై గుంతలు కూడా పూడ్చలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తప్పుడు ఆరోపణలతో ప్రజల వద్దకు వస్తున్న వారిని ప్రజలు అప్రమత్తంగా గమనించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చుడా చైర్‌పర్సన్‌ కఠారి హేమలత, మొదలియార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ త్యాగరాజన్‌, మాజీ ఎమ్మెల్సీ బీఎన్‌ రాజసింహులు, మాజీ మేయర్‌ అముద, తెదేపా నగర అధ్యక్షుడు వరుణ్‌కుమార్‌, కూటమి నాయకులు రాజేష్‌కుమార్‌రెడ్డి, గోపాలకృష్ణ, అట్లూరి శ్రీనివాసులు, వెంకటేష్‌యాదవ్‌, పుష్ప, లీలావతి, క్లస్టర్‌, డివిజన్‌, బూత్‌ ఇన్‌చార్జులు పాల్గొన్నారు.
🏠 Home