మదనపల్లిలో ఆర్టీసీ డీపీటీఓ కార్యాలయం ఏర్పాటు చేయాలి... కలెక్టర్కు ఏఐటీయూసీ వినతి
మదనపల్లి, సెప్టెంబరు 21 (రాజనీతి): అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో ఆర్టీసీ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసు (డీపీటీఓ/డీటీసీ) కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్కు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేసినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ తెలిపారు. జిల్లా ఏర్పడి తొమ్మిది నెలలు గడుస్తున్నా కార్యాలయం లేక ప్రజలు, ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రవాణా సంబంధిత పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. తక్షణమే కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజలకు పరిపాలనా సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో సి.ఏ. బాబు, గజపతి, తిరుమల, రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.