🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 21 Sep, 2026 | Page: 1

చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన మధుసూదన్

పుంగనూరు, సెప్టెంబరు 21 (రాజనీతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా కుప్పం చేరుకున్న సందర్భంగా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ మధుసూదన్‌ నాయుడు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబుకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలతో పాటు పార్టీ బలోపేతంపై ముఖ్యమంత్రితో చర్చించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
🏠 Home