శిష్య బృందం ఆధ్వర్యంలో ఖ్వాజా జుబేర్ ఖాదరీ జన్మదిన వేడుకలు
రేణిగుంట, సెప్టెంబరు 20 (రాజనీతి): మిరియాల బాబా గౌసియా ఆశ్రమంలో పీఠాధిపతి ఖ్వాజా జుబేర్ హయాత్ అలీ షా ఖాదరీ జన్మదిన వేడుకలను ఆదివారం శిష్య బృందం ఘనంగా నిర్వహించింది. ఆశ్రమ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఖాదరీ పీఠాధిపతి జుబేర్ ఖాదరీ చేత ఫాతెహా నిర్వహించి, కేక్ కట్ చేయించారు. అనంతరం శిష్యులు, భక్తులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలకు హాజరైన భక్తులందరిపై అల్లాహ్ రబ్బుల్ ఇజ్జత్ కరుణాకటాక్షాలు ఉండాలని దీవించారు. కార్యక్రమంలో ఆశ్రమ ట్రస్టీలు, మాషాయక్ అసోసియేషన్ ప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.