🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 20 Sep, 2026 | Page: 1

భక్తిశ్రద్ధలతో బాబా రాందేవ్ జయంతి ఉత్సవాలు

చౌడేపల్లి, సెప్టెంబరు 20 (రాజనీతి): బాబా రాందేవ్‌ జీ జయంతిని పురస్కరించుకుని మార్వాడీ సమాజ్‌ సభ్యులు ఆదివారం భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర, పాదయాత్ర నిర్వహించారు. చౌడేపల్లి నుంచి మదనపల్లె వరకు భక్తులు కాలినడకన తరలివెళ్లి బాబా రాందేవ్‌ జీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీజే పాటలు, సంప్రదాయ వాయిద్యాల నడుమ సాగిన శోభాయాత్రలో మహిళల నృత్యాలు, రాసలీలల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మార్వాడీ సంఘం ప్రతినిధులు, యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home