🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 20 Sep, 2026 | Page: 1

సంతోష్ కుటుంబానికి అంబేద్కర్ సేవా సమితి ఆర్థిక సాయం

చౌడేపల్లి, సెప్టెంబరు 20 (రాజనీతి): రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గోసలకురుపల్లికి చెందిన సంతోష్‌ కుటుంబానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు. సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం. మునిస్వామి, పవన్‌, పి. వెంకట్రామయ్య ఆధ్వర్యంలో దహనక్రియల ఖర్చుల కోసం రూ.5,500 అందజేశారు. కార్యక్రమంలో వేలకపల్లి చంగల్రాయప్ప, బ్యాంక్‌ రెడ్డప్ప, బస్టాండ్‌ శేఖర్‌ తదితరులు పాల్గొని సంతోష్‌ కుటుంబానికి సానుభూతి తెలిపారు.
🏠 Home