🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 20 Sep, 2026 | Page: 1

సింహం ముందు ఫ్లూట్‌ కాదు...గురజాల జగన్‌ మోహన్ ముందు రాజకీయ ఆట కాదు!

చిత్తూరు ( రాజనీతి ): ప్రత్యర్థి ఎవరైనా ఎదురొచ్చినప్పుడు వెనక్కి తగ్గేది లేదని.. అభివృద్ధి విషయంలో తనకు తానే సాటి అని చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్‌ మోహన్‌ తనదైన శైలిలో స్పష్టం చేస్తున్నారనే భావనకు అనుగుణంగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలనే సంకల్పంతో ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు.

మాట ఇస్తే వెనక్కి తగ్గని నాయకత్వం...

ఒకడు నాకు ఎదురు వచ్చిన వాడికే రిస్కు.. నేను ఒకడికి ఎదురు వెళ్లిన వాడికే రిస్కు అనే మాస్‌ డైలాగ్‌ తరహా వ్యాఖ్యలు జగన్‌ మోహన్‌ దూకుడు రాజకీయ శైలిని ప్రతిబింబిస్తున్నాయి. అదే సమయంలో ఫ్లూట్‌ జింక ముందు ఊదాలి.. సింహం ముందు కాదు అనే వ్యాఖ్య ద్వారా సందర్భానుసారంగా వ్యవహరించాలనే తన వైఖరిని చాటుతున్నారని ప్రజలు చెబుతున్నారు.

అభివృద్ధే అసలైన లక్ష్యం...

చిత్తూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడితే తనకు మించి ఎవరూ చేయలేరనే ధీమాను ఎమ్మెల్యే వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. మాటలకే పరిమితం కాకుండా కార్యాచరణలో ఫలితాలు చూపించడమే నాయకత్వానికి కొలమానమని ప్రజలు పేర్కొంటున్నారు. గురజాల జగన్‌మోహన్‌ దూకుడు రాజకీయ శైలి.. అభివృద్ధి లక్ష్యాలతో కలిసినప్పుడు చిత్తూరు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు దారితీస్తుందనే చర్చ సాగుతోంది.
🏠 Home