చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అడుగు పడితే.. పేదల ఇంట సంతోషం!...
చిత్తూరు (రాజనీతి) :పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్రావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజాదర్బార్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన–2.0 కింద చిత్తూరు అర్బన్ పరిధిలో ఇళ్లు మంజూరైన 309 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ... సంక్షేమం అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గత ఏడాది పీఎంఏవై కింద వెయ్యికి పైగా ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు.ప్రస్తుతం 309 మందికి ఇళ్లు మంజూరైనట్లు చెప్పారు. ఒక్కో ఇంటికి కేంద్రం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.2.50 లక్షలు మంజూరవుతాయని వివరించారు.మిగిలిన అర్హులను గుర్తించి ఇళ్ల మంజూరుకు జాబితాలు సిద్ధం చేయాలని కూటమి నాయకులను కోరారు. ఇప్పటికే ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులు చేపట్టేలా అధికారులు అవసరమైన సహకారం అందించాలని సూచించారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని ఎంపీ, ఎమ్మెల్యే కోరారు.ఈ
కార్యక్రమంలో చుడా చైర్పర్సన్ కఠారి హేమలత, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, తెదేపా చిత్తూరు పరిశీలకులు కుమారి, కూటమి నాయకులు అట్లూరి శ్రీనివాసులు, రాజేష్కుమార్రెడ్డి, నళిని, క్లస్టర్, యూనిట్, డివిజన్, బూత్ ఇన్ఛార్జులు, తెదేపా, భాజపా నాయకులు పాల్గొన్నారు.