వానాకాలం వచ్చేసింది.. ఈఈ మునిచంద్ర రంగంలోకి దిగారు!
చిత్తూరు (రాజనీతి) డైలీ దినపత్రిక: వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు జిల్లా ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ మునిచంద్ర సూచించారు. వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల సమయంలో విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని తెలిపారు. తెగిపడిన విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దని హెచ్చరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా జిల్లాలోని నగరాలు, పట్టణాలు, మండలాల పరిధిలో క్షేత్రస్థాయి తనిఖీలు చేపడుతున్నట్లు మునిచంద్ర తెలిపారు. విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితిని పరిశీలిస్తూ అవసరమైన చోట ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. చెట్లు విరిగిపడటం, స్తంభాలు దెబ్బతినడం, తీగలు తెగిపడటం వంటి ఘటనలపై సిబ్బంది తక్షణమే స్పందించాలని సూచించారు.
ప్రజల సమస్యలకు తలుపులు తెరిచిన మునిచంద్ర....
విద్యుత్ సరఫరా అంతరాయం, వంగిన స్తంభాలు, వేలాడుతున్న లేదా తెగిపడిన తీగలు వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు. అవసరమైతే ప్రజలు నేరుగా తన కార్యాలయానికి వచ్చి సమస్యలను తెలియజేయవచ్చన్నారు. సమస్యను గుర్తించిన వెంటనే సమాచారం అందిస్తే ప్రమాదాలను నివారించడంతో పాటు సరఫరాను త్వరగా పునరుద్ధరించే అవకాశం ఉంటుందని తెలిపారు. వర్షాకాలంలో చిన్న నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి దారితీసే అవకాశం ఉన్నందున ప్రజలు భద్రతా నిబంధనలు పాటించాలని మునిచంద్ర పిలుపునిచ్చారు.