🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 16 Sep, 2026 | Page: 1

అన్నస్వామిపల్లెలో ఘనంగా వినాయక నిమజ్జనం..రూ.1.40 లక్షలకు వినాయకుడి లడ్డూ వేలం

రేణిగుంట, సెప్టెంబర్‌ 16 (రాజనీతి): రేణిగుంట మండలం అన్నస్వామిపల్లె గ్రామంలో గ్రామ యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్‌ మండపంలో రెండు రోజులుగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా వినాయక విగ్రహ నిమజ్జనాన్ని గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. గత 20 ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీలో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంలో కరణం మునిరెడ్డి రూ.1.40 లక్షలకు దక్కించుకున్నారు. అలాగే గతేడాది రూ.40 వేలు పలికిన నోట్ల హారం ఈసారి రూ.81 వేలకు మునేష్‌యాదవ్‌ సొంతం చేసుకున్నారు. అనంతరం కోలాటాలు, భజనలు, మేళతాళాల మధ్య వినాయక విగ్రహాన్ని గ్రామంలో ఊరేగించి నిమజ్జనం చేశారు.
🏠 Home