🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 16 Sep, 2026 | Page: 1

నిరాడంబరంగా వినాయక విగ్రహాల నిమజ్జనం

చౌడేపల్లి, సెప్టెంబర్‌ 16 (రాజనీతి): చౌడేపల్లి పట్టణంలో వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, నిరాడంబరంగా నిర్వహించారు. మూడు రోజులపాటు పూజలు అందుకున్న గణనాథుడి విగ్రహాలను బుధవారం యువత ఆధ్వర్యంలో ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. శ్రీ అభీష్ట మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం ఎదుట వినాయక యువజన సంఘం ఏర్పాటు చేసిన విగ్రహాన్ని పట్టణంలో ఊరేగించి సమీపంలోని పిల్లారి జీవన్‌ ప్రకాష్‌ వ్యవసాయ బావిలో నిమజ్జనం చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. బజార్‌ వీధి, గాంధీ వీధి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను కూడా భక్తులు కోలాహలంగా నిమజ్జనం చేశారు. భక్తి పాటలతో బస్టాండ్‌ వద్ద యువత నృత్యాలు చేస్తూ సందడి చేశారు.
🏠 Home