🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 15 Sep, 2026 | Page: 1

రాష్ట్రస్థాయి గట్కా పోటీల్లో రేణిగుంట విద్యార్థుల ప్రతిభ

రేణిగుంట, సెప్టెంబర్‌ 14 (రాజనీతి): విజయవాడ విజ్ఞాన విహార్‌ పాఠశాలలో ఈనెల 13,14 తేదీల్లో నిర్వహించిన 5వ రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లాల సబ్‌జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ గట్కా ఛాంపియన్‌షిప్‌–2026లో రేణిగుంట బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. జిల్లా నుంచి 26 మంది పాల్గొనగా, పాఠశాల నుంచి తొమ్మిది మంది పోటీల్లో పాల్గొన్నారు. కె.విశ్వనాథ్‌ బంగారు, వెండి పతకాలు సాధించగా, డి.ప్రవీణ్‌కుమార్‌, పి.సుమంత్‌ వెండి, కాంస్య పతకాలు సాధించారు. బి.మనీహర్‌, బీరప్ప, ఎం.ధనూష్‌, పి.వెంకటేష్‌, కె.సలేష్‌, వి.నవీన్‌కుమార్‌ కాంస్య పతకాలు సాధించారు. ప్రధానోపాధ్యాయురాలు వి.పి.శంకరి, వ్యాయామ ఉపాధ్యాయులు డా.పి.ప్రభాకర్‌రావు, శకుంతల తదితరులు విద్యార్థులను అభినందించారు.
🏠 Home