తిరుపతి–విజయవాడ మధ్య ఫ్లై 91 విమాన సర్వీసు ప్రారంభం
తిరుపతి, సెప్టెంబర్ 10 (రాజనీతి): తిరుపతి విమానాశ్రయం నుంచి విజయవాడకు నూతన విమాన సర్వీసు గురువారం ప్రారంభమైంది. ఫ్లై 91 సంస్థ నిర్వహించే ఈ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తిరుపతి విమానాశ్రయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ప్రారంభ విమానానికి భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ అగ్నిమాపక విభాగం ఆధ్వర్యంలో సంప్రదాయ వాటర్ కేనన్ సెల్యూట్తో ఘన స్వాగతం పలికారు. అనంతరం తిరుపతి విమానాశ్రయ డైరెక్టర్ డి. భూమినాథన్, ఇతర ప్రముఖులు తొలి ప్రయాణికుడికి బోర్డింగ్ పాస్ను అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి నూతన విమాన సర్వీసు ప్రారంభాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తిరుపతి దేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటని, దేశం నలుమూలల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుపతికి వస్తుంటారని అన్నారు. ఫ్లై 91 ద్వారా విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్ నగరాలకు అదనపు నేరుగా విమాన అనుసంధానం అందుబాటులోకి రావడంతో భక్తులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయం కలుగుతుందని తెలిపారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుపతి నుంచి కువైట్ వంటి అంతర్జాతీయ ప్రాంతాలకు నేరుగా విమాన అనుసంధానం ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
వారంలో నాలుగు రోజులు విజయవాడకు..
ఫ్లై 91 విమానం హైదరాబాద్–తిరుపతి–విజయవాడ–తిరుపతి–హైదరాబాద్ మార్గంలో వారానికి నాలుగు రోజులు, మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం నడుస్తుంది. హైదరాబాద్ నుంచి ఉదయం 7.40 గంటలకు బయలుదేరి 8.05 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతి నుంచి 8.05 గంటలకు బయలుదేరి 9.15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి విజయవాడ నుంచి 9.45 గంటలకు బయలుదేరి 10.50 గంటలకు తిరుపతికి చేరుకుని, అనంతరం హైదరాబాద్కు వెళ్తుంది.
రాజమండ్రికి వారంలో మూడు రోజులు..
అదేవిధంగా హైదరాబాద్–తిరుపతి–రాజమండ్రి–తిరుపతి–హైదరాబాద్ మార్గంలో సోమవారం, బుధవారం, శుక్రవారం వారానికి మూడు రోజులు విమాన సర్వీసు కొనసాగుతుంది. హైదరాబాద్ నుంచి ఉదయం 7.40 గంటలకు బయలుదేరి 8.05 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి నుంచి 8.05 గంటలకు బయలుదేరి 9.30 గంటలకు రాజమండ్రి చేరుకుంటుంది. తిరిగి రాజమండ్రి నుంచి 10 గంటలకు బయలుదేరి 11.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. కొత్త విమాన సర్వీసుతో తిరుపతి నుంచి విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్ నగరాలకు ప్రయాణించే భక్తులు, ప్రజలకు మరింత సౌకర్యవంతమైన రవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లయింది. దీంతో తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రాంతీయ విమాన అనుసంధానం మరింత బలోపేతం కానుంది.