🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 09 Sep, 2026 | Page: 1

సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తాం

వాల్మీకిపురం సెప్టెంబర్ 9 (రాజనీతి): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని మార్కెట్ కమిటీ చైర్మన్ కోసూరి చంద్రమౌళి, మండల టీడీపీ అధ్యక్షుడు దాము రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని హాసన్‌ఖాన్ వీధిలో ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజేంద్రచారి, రాజగోపాల్, ఖలందర్, మురళి, గాంధీపేట రెడ్డి, గోవిందు, మహమ్మద్ అలీ, చాను, తాహిర్, కేకే, సాంబ, ఆది తదితరులు పాల్గొన్నారు.
🏠 Home