🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 09 Sep, 2026 | Page: 1

మేడుకుర్తి పీహెచ్‌సీలో డీపీఎంఓ ఆకస్మిక తనిఖీ

మేడుకుర్తి సెప్టెంబర్ 9 (రాజనీతి): మేడుకుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ప్రోగ్రామ్ మానిటరింగ్ ఆఫీసర్ (డీపీఎంఓ) డాక్టర్ రమేష్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వైద్య సేవలు, రికార్డులు, రిజిస్టర్లు, మందుల నిల్వలు, సిబ్బంది హాజరును పరిశీలించారు. ఎస్‌ఏఎస్‌ఏ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని, ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. రోగులకు నాణ్యమైన వైద్యం, ఉచిత మందులు అందేలా చూడాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు కావ్యగాంధీ, ప్రసన్నలక్ష్మి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home