🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 09 Sep, 2026 | Page: 1

ఓట్ల కోసమే కొత్త పింఛన్ల డ్రామా.... వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి వడ్డీ హరి

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త పింఛన్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి వడ్డీ హరి విమర్శించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలకు అతీగతీ లేకుండా ఇప్పుడు కొత్త పింఛన్లను తెరపైకి తేవడం ఓట్ల కోసమేనని ఆరోపించారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
🏠 Home