🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 08 Sep, 2026 | Page: 1

కుష్ఠు రహిత సమాజాన్ని నిజం చేద్దాం.... డా. శ్రీగిరీష్‌, డా. చంద్రశేఖర్‌ నాయక్‌

తలుపుల సెప్టెంబర్ 8 (రాజనీతి): కుష్ఠు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా పూర్తిగా నయం చేయవచ్చని తలుపుల పీహెచ్‌సీ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష్‌, డా. చంద్రశేఖర్‌ నాయక్‌ తెలిపారు. పీహెచ్‌సీలో ఎల్‌సీడీసీ ప్రచార సామగ్రిని ఆవిష్కరించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్‌ 11 నుంచి 24 వరకు ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి స్పర్శలేని మచ్చలను గుర్తించేందుకు సర్వే నిర్వహిస్తారని తెలిపారు. పాలిపోయిన, రాగి లేదా ఎరుపు రంగు మచ్చలతో పాటు స్పర్శజ్ఞానం, నొప్పి లేకపోతే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సర్వేకు ప్రజలు సహకరించి కుష్ఠు రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ డీహెచ్‌ఈఓ కొండయ్య, పీహెచ్‌ఎన్‌ కుసుమ, పర్యవేక్షకులు నాగమ్మ, ఏఎన్‌ఎంలు, సీహెచ్‌ఓలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home