కుష్ఠు రహిత సమాజమే లక్ష్యం
మెడికుర్తి సెప్టెంబర్ 8 (రాజనీతి): కుష్ఠు వ్యాధిని తొలిదశలోనే గుర్తించి చికిత్స అందించడమే లక్ష్యంగా మెడికుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఎల్సీడీసీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బి. కావ్యగంధ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 11 నుంచి 24వ తేదీ వరకు ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కుష్ఠు వ్యాధి లక్షణాలపై పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. స్పర్శలేని తెల్లటి లేదా రాగి రంగు మచ్చలు, చర్మం మొద్దుబారడం, నాడీ వాపు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కుష్ఠు వ్యాధికి ప్రభుత్వం ఉచితంగా ఎండీటీ చికిత్స అందిస్తుందని, అపోహలు, వివక్షకు దూరంగా ఉండాలని కోరారు. అనంతరం పోస్టర్లు, బ్యానర్లను ఆవిష్కరించి అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్ఎల్ఈపీ నోడల్ పర్సన్ జె. సుధాకర్, సూపర్వైజర్ గిరిజమ్మ, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.