🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 07 Sep, 2026 | Page: 1

వినాయక చవితి ఉత్సవాలకు రూ.1,00,116 విరాళం

చౌడేపల్లి, సెప్టెంబర్ 7 (రాజనీతి): స్థానిక శివాలయం వద్ద రాజకీయాలకు అతీతంగా ప్రతి ఏటా నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మిద్దింటి కిషోర్ రూ.1,00,116 విరాళాన్ని అందించారు. ఉత్సవ కమిటీ సభ్యులకు నగదును అందజేసిన ఆయన, గ్రామ ప్రజలంతా ఐక్యంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.
🏠 Home