చౌడేపల్లి టీడీపీలో ‘ఐక్యత రాగం’.. నూతనోత్సాహం!
చౌడేపల్లి సెప్టెంబర్ 6 (రాజనీతి): పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల టీడీపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బోయకొండ మాజీ చైర్మన్ ఎస్.కె. వెంకటరమణారెడ్డి, సీనియర్ నాయకుడు మాదిరాజు లక్ష్మణరాజు (పతి రాజు) తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనబెట్టి ఒక్కటయ్యారు. ఆగస్త్యేశ్వరస్వామి ఆలయ సన్నిధిలో మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్, సీనియర్ నాయకుడు ఆవుల రామచంద్రయ్య తదితరుల సమక్షంలో ఇరువురు నేతలు ఆత్మీయంగా కలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నాయకుల ఐక్యత పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. వార్డు స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమష్టిగా పనిచేయాలని నేతలు, కార్యకర్తలు నిర్ణయించారు. కీలక నేతల కలయికతో మండలంలో టీడీపీకి మరింత బలం చేకూరిందని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.