వైఎస్సార్సీపీ జిల్లా స్థాయి కీలక సమావేశం
తిరుపతి, సెప్టెంబర్ 6 (రాజనీతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ఆదివారం తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని పి.ఎల్.ఆర్ కన్వెన్షన్ హాల్లో జిల్లా స్థాయి ముఖ్య సమావేశం నిర్వహించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు, రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్, మేయర్, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల నాయకులు హాజరయ్యారు.