మేళ్లచెరువు నైమిశారణ్య ఆశ్రమానికి రక్షణ కల్పించాలి
పీలేరు, సెప్టెంబర్ 6 (రాజనీతి): మేళ్లచెరువులో 2011 నుంచి నిర్వహిస్తున్న నైమిశారణ్య ఆశ్రమానికి రక్షణ కల్పించాలని ఆశ్రమ నిర్వాహకులు, భక్తులు పీలేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు ఆశ్రమానికి వచ్చి భక్తులు, నిర్వాహకులతో దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీంతో మహిళలు, వృద్ధుల్లో భయాందోళన నెలకొంటోందన్నారు. ఘటనలపై విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆశ్రమానికి