🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 05 Sep, 2026 | Page: 1

వాల్మీకిపురంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

వాల్మీకిపురం, సెప్టెంబర్ 5 (రాజనీతి): వాల్మీకిపురం ఎంఆర్సీ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో గురువుల కృషి వెలకట్టలేనిదని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే ఉపాధ్యాయుల సేవలను గుర్తుచేసుకున్నారు. సీనియర్ ఉపాధ్యాయులు మహబూబ్ అలీ ఖాన్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈవోలు వెంకటరత్నం, వెంకటలక్ష్మి, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
🏠 Home